శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తిరుమల శ్రీవారిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లు గురువారం సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుమారులు రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ పాల్గొన్నారు. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రెండో సారి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా కుటుంబ సమేతంగా శ్రీ వారిని దర్శించుకోవడం జరిగిందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ ప్రజలకు మరింత సేవనందించేలా చూడాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.
