సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు మారెడ్డి సింగారెడ్డి, ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
