నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా మాదాపూర్ డివిజన్ ఖానామెట్ చౌరస్తా లో జాతీయ జెండాను మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచనం కొరకు రజాకార్ల తో ఎదురు నిలబడి కొట్లాడిన గడ్డ మన తెలంగాణ అని, నేడు తెలంగాణను పాలిస్తున్న వారసుల విమోచన దినం కావాలి అని కొనియాడారు. ఆ దిశగా 2023 లో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి రాబోతుందని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా భారతీయ జనతా పార్టీ పాలిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, డివిజన్ ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, మధుయాదవ్, ప్రధాన కార్యదర్శి మదనాచారి, గోవర్ధన్ రెడ్డి, ఓబీసీ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణగౌడ్, సత్యం చారి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బాలకుమార్, బీజేవైఎం అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, చరణ్, నరేష్, శ్రీధర్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.