మాదాపూర్, సెప్టెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సర్వే ఆఫ్ ఇండియా లేఅవుట్ డ్రైనేజీ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి లేఔట్ పరిసర ప్రాంతాలని పరిశీలించారు. గడిచిన 15 సంవత్సరాలనుండి ఇక్కడ ఒక్క పని కూడా జరగకపోవటం అప్పటి నుంచి కేవలం ఒక్క సీసీ రోడ్ లైన్, కనీసం ప్రారంభ దశకి కూడా నోచుకోని డ్రైనేజీ వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ అన్నారు. 15 సంవత్సరాలనుండి ఈ ప్రాంతం GHMC అధికారులకు, పదవుల్లో ఉన్న నాయకులకు ఎందుకు కనపడలేదని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్, రఘువర్ధన్ రెడ్డి, రంగస్వామి, యాదగిరి, శివ, సుమన్ నాయక్, శ్రీనివాస్ నాయక్, మహేందర్, విజయ రెడ్డి, మహేష్, శివ, సురేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.