అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. కార్పొరేటర్ శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను పూర్తి చేసి ప్రజలకు విడతల వారిగా అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తాన‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ పవన్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ నవీన్, స్థానిక నాయకులు మహేశ్వర్ రెడ్డి, జితేందర్, కాలనీ వాసులు రామాంజనేయరెడ్డి, రాఘవరావు, అశోక్, సంపత్ రెడ్డి, మాణిక్ రెడ్డి, వెంకటేశ్వర శర్మ, బస్వేశ్వరావు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కాల‌నీవాసుల‌తో మాట్లాడుతున్న కార్పొరేటర్ శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here