శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో అంగన్‌వాడీ టీచర్ మనీలా ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ సమక్షంలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఒకటి నుండి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించకపోతే వారికి పోలియో వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఈ వైరస్ ముఖ్యంగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని, దీనివల్ల శాశ్వత పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కనుక పిల్లలకు పోలియో డ్రాప్స్‌ను కచ్చితంగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నిత్య, సంతోష్, శిరీష, నందిని, కాలనీ మహిళలు, చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.






