శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తల్లిదండ్రులకు సూచించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని వార్డు ఆఫీస్ కార్యాలయం, యూత్ కాలనీ మూసబ్ స్కూల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి, వారిని పోలియో మహమ్మారి నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ గౌడ్, సయ్యద్ సాదిక్, జమీర్ లిమ్రా, పవన్ గౌడ్, సతీష్, అంజద్ ఖాన్, సో పాషా, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.






