మదీనాగూడలో దెబ్బతిన్న రోడ్లపై బీజేపీ నాయకుల ఫిర్యాదు

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ విలేజ్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల అనంతరం పూర్తిగా దెబ్బతిన్న రహదారులను తక్షణమే పునర్నిర్మించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసి, రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మదీనాగూడ విలేజ్‌లోని జాతీయ రహదారి NH-65 నుంచి మంజీరా పైప్‌లైన్ రోడ్డు వరకు ఉన్న మార్గంతోపాటు, పీర్ల మజీద్ రోడ్డు, ఇతర కనెక్టివిటీ రహదారులు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల అనంతరం పూర్తిగా దెబ్బతిన్నాయని బీజేపీ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రహదారుల దుస్థితి కారణంగా నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని, దెబ్బతిన్న రహదారుల స్థానంలో నూతన బీటీ (BT), సీసీ (CC) రోడ్లను నిర్మించి రవాణా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి సురేష్ కుర్మ, నరసింహ యాదవ్, వజీర్ రాజు, పవన్, పాలెం శ్రీనివాస్, శ్రీకాంత్, రామ్ రెడ్డి, నాగేష్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here