నమస్తే శేరిలింగంపల్లి: పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ స్థాపన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీఎంహెచ్ఓ సృజన, స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. అనంతరం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ డాక్టర్ రాంరెడ్డితో కలిసి పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరిగా వేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. పోలియో చుక్కలు వేయించడం ద్వారా పిల్లల భవిష్యత్తును ఆరోగ్యవంతంగా మార్చవచ్చని అన్నారు. తల్లిదండ్రులు భాద్యతతో అప్పుడే పుట్టిన పసి బిడ్డ నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న ప్రతి చిన్నారి వరకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో, కాలనీల లోని కమ్యూనిటీ హాల్స్ లో, ముఖ్య కూడళ్లలో, బస్సు స్టాప్స్ వద్ద, రైల్వే స్టేషన్స్ వద్ద, మొబైల్ టీమ్స్ ద్వారా పోలియో చుక్కల పంపిణి కార్యక్రమం ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, వైద్య సిబ్బంది, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు లక్ష్మారెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, నల్ల సంజీవ రెడ్డి, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్ లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ దవాఖాన, స్టాలిన్ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో స్థానికులు, వైద్య సిబ్బంది తో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని 0-5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రిక ప్రసాద్ గౌడ్, స్వామి నాయక్, అబ్రహం, సోమేశ్, చారి, వెంకటేష్, దేవేందర్, ప్రసాద్, చందు, రవి గౌడ్, జంగం మల్లేష్, రాజు, నర్సింహ గౌడ్, శివ, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్ లో...
ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ కాలనీ, ఇంద్రానగర్ బస్తీ దవాఖానా, శంకర్ నగర్ కాలనీలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, వైద్య సిబ్బంది కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, రమేష్, ప్రవీణ్ రెడ్డి, బోస్, ఇమ్రాన్, సందీప్ రెడ్డి, దాసు, హరీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అమిత్, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ డివిజన్ లో…
కొండాపూర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు పల్స్ పోలియో కేంద్రాలను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. చిన్నారులకు ఆయన చేతుల మీదుగా రెండు పల్స్ పోలియో చుక్కలను వేశారు. ప్రతి తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో చుక్కలు వేయించటంలో నిర్లక్ష్యం వహించకుండా, పిల్లలు భవిష్యత్తుకు పునాది వెయ్యాలని, వారి నిండు నూరేళ్ళ జీవితానికి ఈ రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ సెక్రటరీ బలరాం యాదవ్, రూపరెడ్డి, డాక్టర్ రమేష్, గిరి గౌడ్, మంగమ్మ, శ్యామల, నర్సింహులు గౌడ్, నాయుడు, కుమార్, పుణ్యవతి, లక్ష్మణ్, రఫియా బేగం, దీపక్, రమేష్ యాదవ్, రాజా మోహన్ రావు రఫీ, మొహ్మ్మద్, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ లో…
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి విలేజ్ లో గల బస్తీ దావఖాన లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి ఐదేళ్లు లోపు పిల్లలందరికీ ఖచ్చితంగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్ , ప్రకాష్, రంగస్వామి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
మక్తాలో పోలియో కేంద్రాన్ని పరిశీలించిన జ్ఞానేంద్ర ప్రసాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మక్త ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు వ్యాధినిరోధక కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో జనోద్యమంగా మార్చే కృషిలో పాలుపంచుకున్న ఆరోగ్యరక్షణ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు రవి గౌడ్, శ్రీధర్ రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.