వ్యక్తిగత నీటి సంరక్షణ అవార్డు అందుకున్న వెంకట్ యాదవ్ – మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: నీటిని వృథా చేయకుండా ప్రతీ వర్షపు చుక్కను ఒడిసిపట్టి నీటి సంరక్షణకు‌ కృషి చేసిన సిద్దిన బోయిన వెంకట్ యాదవ్ కు నేషనల్ రివర్ కన్సర్వేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో అవార్డును అందుకున్నారు. శేరిలింగంపల్లి లోని సప్తగిరి కాలనీ కి చెందిన సిద్దిన బోయిన వెంకట్ యాదవ్ ఈ అవార్డును అందుకున్న శుభసందర్భంగా మాట్లాడారు. 2007 లో తన ఇంటి నిర్మాణం చేసేటప్పుడు లక్షా యాభై వేల లీటర్ల సంపును ఇంటి కింద నిర్మించి రూఫ్ మీద కురిసిన ప్రతి వర్షం చుక్కను సహజంగా వడగట్టి ఆ సంపులో పడేలా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా ఇంటి అవసరాలకు‌ అదే నీటిని వాడుకుంటున్నట్లు చెప్పారు. ప్రకృతికి మేలు చేస్తూ సహజ వాన నీటినిసంరక్షిస్తున్నందుకు, పలువురికి అవగాహన కల్పిస్తూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలో ఇప్పటి వరకు 20 గృహ నిర్మాణాలకు ఇదే పద్దతిలో నీటి సంరక్షణ చేపట్టినందుకు గాను 2021సంవత్సరానికి గాను వ్యక్తిగత నీటి సంరక్షణ అవార్డ్ కు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని వెంకట్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్, తెలంగాణ వాటర్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ వి. ప్రకాష్, పురుషోత్తం యాదవ్ పాల్గొన్నారు.

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న వెంకట్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here