ఆలయాల సందర్శనతో మానసిక ప్రశాంతత – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ఆలయాల సందర్శనతో మానసిక ప్రశాంతత అలవడుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడలో కాళీమాతా అమ్మవారి ఆలయంలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు శివ సింగ్, దేవేందర్ రెడ్డి, నర్సింగ్ నాయక్ , ప్రకాష్ , గోపాల్, రంగస్వామి ముదిరాజ్, నర్సింగ్ రావు, శంఖేష్ సింగ్ పాల్గొన్నారు.

కాళీమాత వారిని దర్శించుకుంటున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here