తెరాస ప్ర‌చార పాట‌ల సీడీని ఆవిష్క‌రించిన పూజిత‌, జగదీశ్వర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని మైత్రీ నగర్ ఫేజ్‌ 2 లో హ‌ఫీజ్‌పేట‌, మాదాపూర్ డివిజన్ల తెరాస‌ కార్పొరేటర్ అభ్యర్థులు పూజిత‌, జగదీశ్వర్ గౌడ్ లు పార్టీ ప్రచార పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, టీఎస్‌క్యాబ్ చైర్మన్ నాగేందర్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని పాట‌ల సీడీని ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ప్ర‌చార పాటల సీడీని ఆవిష్క‌రిస్తున్న జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, నాగేందర్ గౌడ్, పూజిత‌, జగదీశ్వర్ గౌడ్

అనంత‌రం వారు మాట్లాడుతూ.. కేవ‌లం తెరాస ప్ర‌భుత్వం మాత్ర‌మే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స‌మ‌న్యాయం చేస్తుంద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నూటికి నూరు శాతం అమ‌లు చేస్తున్నామ‌న్నారు. సీఎం కేసీఆర్ గ్రేట‌ర్‌లో అన్ని డివిజ‌న్ల అభివృద్ధికి ప‌క్కా ప్ర‌ణాళిక‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నార‌ని అన్నారు. తెరాస అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తేనే అభివృద్ది జ‌రుగుతుంద‌ని అన్నారు. డిసెంబ‌ర్ 1న కారు గుర్తుకు ఓటు వేసి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సునీత మహేందర్ రెడ్డి, నాగేందర్ గౌడ్, పూజిత‌, జగదీశ్వర్ గౌడ్

ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ తెరాస ప్రెసిడెంట్ గౌతమ్ గౌడ్, సీనియర్ నాయకుడు వాల హరీష్, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, టీఆర్ఎస్ హఫీజ్‌పేట్ మాజీ వార్డ్ మెంబర్ ఆశ, సీనియర్ నాయకుడు శ్యామ్ మోహన్, యూత్ నాయకుడు లోకేష్, వ‌డ్డెర సంఘం దేవేందర్, లక్ష్మా రెడ్డి, ఆనంద్ గౌడ్, నాయకులు జనార్దన్ గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here