
గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం గచ్చిబౌలి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, జిపిఆర్ఏ క్వార్ట్రర్స్ లలో కాంగ్రెస్ అభ్యర్థి అరకల భరత్ కుమార్, పూర్ణిమ భరత్ కుమార్ లు వేర్వేరుగా పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ లను ఉచితంగానే చేయిస్తామని తెలిపారు. ప్రతీ ఇంటికీ 30 వేల లీటర్ల మంచినీటితో పాటు, వరదల్లో నష్టపోయిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని అందిస్తామని పార్టీ మానిఫెస్టోలో ప్రకటించిందని తెలిపారు. 80 గజాల లోపు ఉన్న ఇండ్లకు పన్ను మాఫీ తో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను అందించబోతున్నామని తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.