కూకట్ పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యవర్గ సభ్యుడిగా రాకేష్ దూబే, నార్త్ ఇండియన్ సెల్ కన్వీనర్ గా రాజ్ జైశ్వాల్, స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా వినీతాసింగ్, విద్యావంతుల సెల్ కన్వీనర్ గా రమేష్ పదవల నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి వారికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి మేరీ సోలమన్, బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు హరిప్రియ పాల్గొన్నారు.
