నమస్తే శేరిలింగంపల్లి: తల్లికి, నవజాత శిశువును జాగ్రత్తగా సంరక్షించేలా మామ్ అండ్ టాట్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని పీఆర్ కే హాస్పిటల్ అధినేత డాక్టర్ పుట్టా రవికుమార్ అన్నారు. చందానగర్ లోని పి ఆర్ కె హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మామ్ అండ్ టాట్ (తల్లి బిడ్డ సంరక్షణ కేంద్రం) విభాగాన్ని హాస్పిటల్ అధినేత డాక్టర్ పుట్టా రవికుమార్, డాక్టర్ తలసాని స్వాతి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ సుచిత్ర , సినీ నటి ప్రియాంక జవాల్కర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత రవికుమార్ మాట్లాడుతూ మాతృత్వం ప్రయాణంలో మాతృమూర్తులకు రక్షణగా, ఆశ్రయం కల్పించేలా తల్లులు నవజాత శిశువులకు సురక్షితమైన ఇంటిని సృష్టించాలనే లక్ష్యంతో పీఆర్ కే హాస్పిటల్ లో మామ్ అండ్ టాట్ విభాగాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. హాస్పిటల్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో అత్యుత్తమమైన వైద్యం అందిస్తూ, సమగ్ర సంరక్షణ, అత్యంత భద్రత, లభ్యత కోసం ఈ మామ్ అండ్ టాట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి హైదరాబాద్ నగరంలోని ప్రముఖ గైనకాలజి, పీడియాట్రిక్స్ సంబంధిత విభాగాల వైద్యులు భారీ సంఖ్యలో హాజరై తమ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో, విశాలమైన భవనంలో అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ పుట్టా రవి కుమార్ ని పలువురు వైద్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్స్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ టీం సభ్యులు, అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.