అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వాలి – కలెక్టరేట్ ఎదుట బిజెపి ధర్నా

నమస్తే శేరిలింగంపల్లి: అర్హులైన పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ లక్డికాపూల్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తామని చెప్పడమే తప్పా నేటికి పూర్తి స్థాయిలో పేదలకు ఇవ్వకుండా నాన్చివేత దోరణిని అవలంబించడం సరికాదన్నారు. అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని, లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, గోవర్ధన్ గౌడ్, ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, అనిల్, మాణిక్ రావు, రాజు శెట్టి, ఆంజనేయులు, రాం రెడ్డి, హరికృష్ణ, హనుమాన్ నాయక్, జితేందర్, మేరీ, విజేందర్, నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా‌ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here