నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర, జిల్లా కమిటీ పిలుపు మేరకు బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది అకాల వర్షాల కారణంగా గురైన ముంపు ప్రాంతాల సందర్శనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపినగర్, ఆదర్శ్ నగర్, పరిసర ప్రాంతాల్లో బిజెపి నాయకులు పర్యటించారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రాంతాలను గుర్తించి బస్తీల్లో రక్షణ గోడలను ఏర్పాటు చేయాలని, నాలాలను శుభ్రపరచి, గుర్రపు డెక్కను తొలగించాలన్నారు.
రోడ్డు, డ్రైనేజీల వ్యవస్థను మెరుగుపరచాలని అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధప్రాతిపదికన అన్ని ప్రాంతాల్లో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్, రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, నరేష్, ప్రభాకర్ యాదవ్, నాయకులు రాజు శెట్టి, మాణిక్ రావు, ఆంజనేయులు, హరికృష్ణ, రమేష్, వెంకట్ మారం, జితేందర్, శ్రీశైలం కురుమ, మహిపాల్ రెడ్డి, వరలక్ష్మి, విజేందర్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రమోహన్, హరిప్రియ, విజయ్ లక్ష్మీ, సత్య కురుమ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.