తెలంగాణ మోడల్ స్కూల్ లో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెలలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ముగిశాయి. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు రవీంధర్ రెడ్డి, సుచరిత కొమురయ్య, ప్రధానోపాధ్యాయుడు ఎ. రామ్‌ప్రసాద్‌ బహుమతులను ప్రధానం చేశారు.

వెలిమలలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో విజేతలకు‌ బహుమతిని అందజేస్తున్న దృశ్యం

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందజేసిన నోట్ పుస్తకాలతో పాటు ప్రభుత్వం తరపున విద్యార్థులకు యూనిఫాం బట్టలను అందజేశారు. జాతీయ పండుగ వేడుకల్లోనే కాకుండా దేశం పట్ల గౌరవాన్ని, దేశభక్తిని ఎల్లప్పుడూ చాటుకోవాలని అతిథులు సూచించారు. జాతీయ జెండాలను సముచిత గౌరవంతో ఆయా చోట్ల పడిపోయిన, పాడైపోయిన జెండాలను తమకు అందించాలని విద్యార్థులకు ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ కోరారు. ఈ‌ కార్యక్రమంలో గ్రామస్తులు మహేందర్, కొమురయ్య, అల్లావుద్దీన్, దయాకర్, సత్యనారాయణ, రోటేరియన్ విజయ దుర్గ, పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మోనో యాక్షన్, వ్యాసరచన, రంగోలీ, నృత్య పోటీల్లో‌ గెలుపొంది‌ బహుమతి అందుకున్న విద్యార్థినీ ఎన్ వీ వైష్ణవి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here