నమస్తే శేరిలింగంపల్లి: ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బిజెపి రాష్ట్ర కమిటి పిలుపునిచ్చిన నేపథ్యంలో శేరిలింగంపల్లి బిజెపి నేతలు తరలివెళ్లేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసులు కట్టడి చేశారు. ఈ క్రమంలో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ ను చందానగర్ పోలీసులు లింగంపల్లి రెయిన్ ట్రీ అబాడ్ అపార్ట్మెంట్ లో గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చింతకింది గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతూ ప్రశ్నించే ప్రత్యర్థుల గొంతు నొక్కడం హేయమైన చర్య అన్నారు. బిజెపి నేతలను అరెస్టు చేసి అక్రమాలను కప్పి పుచ్చుకోలేరని, ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. త్వరలోనే తెలంగాణ గడీల పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించడం ఖాయమని అన్నారు. అక్రమ అరెస్టులు, గృహ నిర్బందాలతో ప్రభుత్వ చర్యలు అద్దం పడుతున్నాయని అన్నారు.