అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌నే ల‌క్ష్యంగా ప్ర‌ధాని మోదీ పాల‌న‌: ర‌వి కుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో హ‌ఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ విగ్ర‌హ శుద్ధి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. శేరిలింగంప‌ల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే , బిజెపి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొని డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమాజంలో ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే దిశగా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తోంద‌న్నారు. డా. బిఆర్, అంబేద్కర్ ఆశయాలు తరతరాలకు ప్రేరణ, ప్రజాస్వామ్యం, విద్య, సామాజిక సమానత్వం పట్ల ఆయన చూపిన అంకితభావం, నవ భారత పరిపాలనను ఆదర్శంగా నిలుస్తోంద‌ని, మోదీ నాయకత్వంలో ఆయన వారసత్వం కేవలం జ్ఞాపకంగా కాదు, కార్యరూపంలో కొనసాగుతోంద‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ , బీజేపీ రాష్ట్ర మాజీ కౌన్సిల్ మెంబర్ కలివేముల మనోహర్ , బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ , బిజెపి జిల్లా గీత సెల్ కన్వీనర్ రవి గౌడ్ , బీజేపీ మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆళ్ల వరప్రసాద్ , మియాపూర్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మాణిక్ రావు , మియాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ , బిజెపి ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజేందర్ సింగ్ , బిజెపి నాయకులు జగదీశ్వర్ గౌడ్ , శ్రీనివాస్ యాదవ్, పవన్ కుమార్ , సత్యనారాయణ రాజు , బాబు రెడ్డి , అశోక్ , రవి ముదిరాజ్ , మహేష్ కుమార్ , నవీన్ , రామ్ రెడ్డి , వెంకటేశ్వర్లు , భాషా , సుబ్బారావు, యాదగిరి , నరసింహ , రామారావు , రాజ్ కుమార్ , కిరణ్ , వెంకట్ ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here