ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయ నగర్ కాలనీలో తెరాస యువజన నాయకుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ASY క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలు, రన్నరప్ లుగా నిలిచిన టీంలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన వెంకట్ టీమ్ కి రూ.25,000, రెండో టీంకు రూ.11,000 చెక్కులను ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. టోర్నమెంట్ లో చ్చిన మొత్తం రూ.1,11,000 లను వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని ప్రభుత్వ గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మూర్తి, శివా రెడ్డి, ధీరజ్, పవన్ కుమార్, రవి కుమార్, యశ్వంత్, శ్రీకాంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.

