మూడో విఢత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం – బండి సంజయ్ తో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: డ్రగ్స్ మాఫియా, క్యాసినో లాంటి వాటిలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని, గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారంలో స్వాధీనం చేసుకున్న భూమి పత్రాలు, డబ్బు ఏమైందో కేసీఆర్ సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విఢత ప్రజా సంగ్రామ యాత్ర సభలో బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ప్రారంభానికి ముందు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెపి నాయకులు

వంగపల్లిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై గర్జించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ నేతల అవినీతి బండారాన్ని బయటపెడుతామని అన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, కేసీఆర్ కుటుంబానికి తప్ప తెలంగాణ ప్రజలకు కలిగిన ప్రయోజనం శూన్యమన్నారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన అంతమవ్వాలని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ విముక్తికై చేపడుతున్న ఈ యాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ ఓబీసీ ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, జితేందర్ సింగ్, అరవింద్ సింగ్, బాబులు సింగ్, రంగస్వామి ముదిరాజ్, దుర్గేష్ సింగ్ మహేష్ సింగ్, సంకేష్ సింగ్ నరేష్, చిన్న బిజెపి నాయకులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

యాదాద్రి పుణ్యక్షేత్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి షెకావత్ తో రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here