ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తున్నాం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం సాయి ఐశ్వర్య కాలనీలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం సాయి ఐశ్వర్య కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అదేవిధంగా కాలనీలో రోడ్లు మంజూరయ్యాయని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

సాయి ఐశ్వర్య కాలనీలో పాదయాత్ర చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కాలనీలలో అవసరమున్న చోట డ్రైనేజీని పునరుద్దరిస్తామని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పై అలసత్వం సహించేది లేదని, వర్షాకాలంలో కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ విశాలాక్షి, ఏఈ జగదీష్,వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, జలమండలి మేనేజర్ నరేందర్, ఎస్ ఆర్ పీ కిష్టయ్య, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీను పటేల్, నాయినేని చంద్రకాంత్ రావు, పద్మారావు, నరేష్, సంపత్, సతీష్ ముదిరాజ్, శ్రీకాంత్, సుధీర్, గోవింద్, అక్బర్, సల్లావుద్దీన్, అజిమ్, లియాఖత్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

కాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here