
నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కు మద్దతుగా మియాపూర్ డివిజన్ నుంచి బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు డిఎస్ఆర్ కె ప్రసాద్ బండి సంజయ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్ర కు రోజురోజుకు ప్రజల నుండి మద్దతు పెరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో బండి సంజయ్ సారథ్యంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మియాపూర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు
