నమస్తే శేరిలింగంపల్లి: కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసం గడీల కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కు విశేష స్పందన లభిస్తోందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నాల్గో రోజుకు చేరుకున్న పాదయాత్ర చిలుకూరు చౌరస్తా హిమాయత్ నగర్ నుండి మొయినాబాద్ వరకు చేరుకుంది. బిజెపి ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలతో కలసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ బండి సంజయ్ ను కలిశారు.
