నమస్తే శేరిలింగంపల్లి: బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడే వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం నెలనెలా ఉచితంగా మెడికల్ కిట్స్ ను పంపిణీ చేయడం పట్ల వయోవృద్ధుల, పౌరుల సంక్షేమ సంస్థ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వృద్ధులకు, పౌరులకు ఈ మెడికల్ కిట్స్ పంపిణీ వల్ల ఎంతో ఉపయోగకరమైన చర్య అని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీల్లో తదితర రంగాల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారిలో చాలా మందికి పింఛన్ తక్కువగా వస్తుందని, మందులు కొనడానికి సైతం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ఈ పథకం ద్వారా సహకరించాలని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయమని సంస్థ నాయకులు లక్ష్మయ్య, వెంకటసుబ్బయ్య, బచ్చురాజు, నాగభూషణం, అశోక్, కిష్టన్న తెలిపారు.
