ప్రజా సంగ్రామ యాత్రలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలో గచ్చిబౌలి డివిజన్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. శనివారం పాతబస్తీలోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్ తో కలిసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పూజలు నిర్వహించారు. బిజెపి నాయకులు, కార్యకర్తల తో కలిసి ప్రజా సంగ్రామ యాత్రగా బయల్దేరారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది ఆత్మ బలిదానాలు చేశారన్నారు. అమరుల ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన  సాగిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, మాటలతో మభ్యపెడుతూ కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని‌ చెప్పారు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువకులను మోసగించారని అన్నారు. దళిత బంధు పేరుతో దళితులను, గొర్రెలు, బర్రెలంటూ బీసీలను వంచిస్తున్నారని అని బండి సంజయ్ అన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణంగా మార్చారని దుయ్యబట్టారు. పాతబస్తీలో ఉన్న ఎంఐఎం ఆగడాలను తట్టుకుని హిందువులు జీవిస్తున్నారని, పాతబస్తీని ఇదివరకే వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలని సంజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్,‌ శేరిలింగంపల్లి, చందానగర్ కంటెస్టెంట్ కార్పొరేటర్లు రాధాకృష్ణ యాదవ్, కంచర్ల ఎల్లేష్, కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, సీనియర్ నాయకులు, వెంకటేష్ గౌడ్ , కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, అరుణ్ గౌడ్, శివ సింగ్, శ్రీనివాస్, హరీష్ , శంకర్ యాదవ్, కిషన్, సుబ్రమణ్యం, ప్రకాష్, రంగస్వామి, శ్రీను, రాజు, క్రాంతి, నర్సింగ్ రావు, బిజెపి నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలో‌ పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here