నమస్తే శేరిలింగంపల్లి: నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసం గడీల కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకు ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన ప్రజాసంగ్రామ పాదయాత్రకు జ్ఞానేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకులు బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అవినీతి, గడిల, కుటుంబ పాలనను అంతమోందించిండానికే బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని అన్నారు. ఈ చారిత్రక యాత్రలో బండి సంజయ్ సమయం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆశీస్సులతో యాత్ర విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు ఈ యాత్రనుంచే భీజం పడటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
