రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించండి: కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆదర్శ నగర్ కాలనీ రోడ్ నెంబర్-3 లో చేపట్టిన సిసి రోడ్డు మరమ్మతు పనులను శనివారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు మరమ్మతు పనులలో నాణ్యత లోపించకుండా, మన్నిక గా ఉండాలని అన్నారు. త్వరితగతిన రోడ్డు పనులు ముగించేలా సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గణపురం రవీందర్, సత్యం, సుధాకర్ రెడ్డి, రామచందర్, వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ్ నగర్ లో రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ పాఠశాలలో
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here