నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప హిల్స్ లో మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ శనివారం పాదయాత్ర చేశారు. పాదయాత్రలో స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు రాధాకృష్ణ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షానికి నీరు నిలిచిపోయి రోడ్లు కృంగిపోయి ప్రమాదకరంగా మారాయన్నారు. 15 రోజుల నుంచి శిల్పహిల్స్ రోడ్ నెం.2 లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు పట్టణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఫోటోలకు ఫోజులిచ్చి పత్రికాప్రకటనలు ఇవ్వడమే తప్పా చేసిందేమి లేదన్నారు. ఇప్పుడైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, బాలాజీ, బాలు నాయక్, సత్యం, శివకుమార్ యాదవ్, బాలకుమర్, టిల్లు, నరేష్ రెడ్డి, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.