నమస్తే శేరిలింగంపల్లి: మసాజ్ ముసుగులో వ్యభిచార దందా నడిపిస్తున్న ఓ స్పా పై మాదాపూర్ పోలీసులు, ఎస్ ఓ టీ టీమ్ సంయుక్తంగా రైడ్ చేశారు. సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం కావూరి హిల్స్ లోని హావెన్ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నడుపుతున్నారనే సమాచారం మేరకు స్పా పై మాదాపూర్ పోలీసులు శనివారం రైడ్ చేశారు. ఇద్దరు ఆర్గనైజర్ లను, ఇద్దరు సబ్ ఆర్గనైజర్ లను, ఎనిమిది మంది విటులను అరెస్టు చేశారు. పది మంది మహిళలను రేస్క్యు హోం కు తరలించాారు. రైడ్ లో రూ.73,469 నగదును, 28 మొబైల్ ఫోన్లు, 5 నిరోద్ ప్యాకెట్లను, స్వైపింగ్ మిషన్, ల్యాప్ టాప్ తో పాటు , ఏపీ 07 ఎఫ్ క్యూ 7780 నంబర్ గల క్రెటా కారును సీజ్ చేశారు. వీరిపై సెక్షన్ ఐపీసీ 370 ప్రకారం కేసు నమోదు చేసి నిర్వాహకులు, విటులను జైలు పంపించాారు. స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, అనుమతి లేని క్రాస్ మసాజ్ చేసే స్పా నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని సీఐ రవీంద్ర ప్రసాద్ హెచ్చరించారు.