నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్క్ కాలనీలో వంద శాతం వాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా సోమవారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని గుల్ మొహర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాసిం కు అందజేశారు. గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో వంద శాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గుల్ మొహర్ పార్క్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాసీం, ఉపాధ్యక్షుడు మోహన్ రావు, జనరల్ సెక్రటరీ నిరంజన్ రెడ్డి, అడ్వయిజర్ జై రాజ్ సింగ్ , నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రాంచందర్ యాదవ్, గోపనపల్లి వడ్డెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ప్రకాష్, ఎస్ ఆర్ పీ భరత్, శానిటేషన్ సూపర్ వైజర్ రఘు, తదితరులు పాల్గొన్నారు.
