శేరిలింగంపల్లి డివిజన్ లో ఉత్సాహంగా తెలంగాణ విమోచన దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈరోజు శేరిలింగంపల్లి డివిజన్ లో బిజెపి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి జిల్లా బిజెపి ప్రభరి నంద కుమార్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ హాజరయ్యారు. రజాకార్ల రాక్షస చెర నుండి తెలంగాణ ను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా రాష్ట్రాన్ని విడిపించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లవుతున్నా కెసిఆర్ ఎందుకు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, ఎన్ చంద్ర మోహన్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కురుమ, చిట్టా రెడ్డి ప్రసాద్, జిల్లా ఓబీసి కార్యదర్శి భారత్ రాజ్, జిల్లా మేధావుల సెల్ కన్వీనర్ రాఘవేందర్ రావు, అసెంబ్లీ మహిళ మోర్చా కో కన్వీనర్ భీమని విజయ లక్ష్మి, కుమార్ యాదవ్, భీమని సత్య నారాయణ, యువ మోర్చా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ కురుమ, స్వాతి, వి.గాయత్రి, కె. రంగారెడ్డి, కె. శైలజ, రాఘవేందర్, కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో తెలంగాణ విమోచన దినోత్సవంలో‌ బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here