- జంట సర్కిళ్లలో రెండో రోజు ప్రశాంతంగా సూపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్
- శేరిలింగంపల్లిలో 843, చందానగర్‌లో 923 మందికి కోవీషీల్డ్ టీకాలు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో రెండోరోజు సూపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగింది. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌లో 843 మందికి, చందానగర్ సర్కిల్‌లోని 923 మందికి కోవీషీల్డ్ వ్యాక్సిన్ అందజేశారు. కాగా జీహెచ్ఎంసీ చీఫ్ కమిషనర్ లోకేష్‌కుమార్ చందానగర్ పీజేఆర్ స్టేడియంలోని వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించారు. ఐతే వ్యాక్సినేషన్‌కు వచ్చిన వారలో పలువురు సూపర్‌స్ప్రేడర్ క్యాటగిరికి సంబంధం లేని వారిని చీఫ్ కమిషనర్ గుర్తించి అక్కడి నుంచి పంపిచేశారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులను ఆయన మందలించారు. బయటవారు వ్యాక్సిన్‌కు వస్తే వెంటనే గుర్తించాలని, భాద్యులైన కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సిన్‌కు వచ్చే వారి రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రాంతానికి, టీకా ఇచ్చే ప్రాంతానికి మధ్య దూరం ఎక్కవగా ఉందని, రెండు ఒక చోటికి మార్చాలని అధికారులకు లోకేష్‌కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉపకమిషనర్ సుధాంష్ నందగిరి, ఉపవైద్యాధికారి డాక్టర్ కార్తీక్ మనీషి, ప్రాజెక్ట్ అధికారి వత్సలా దేవి, ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో, హపీజ్‌పేట్ పీహెచ్‌సీ ఏపీఎంఓ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.