మ‌యూరీన‌గ‌ర్ పార్కులో ప‌వ‌ర్‌బోరు ప‌నుల‌ను ప్రారంభించిన కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ జీహేచ్ఎంసీ పార్కులో ప‌వ‌ర్ బోరు ప‌నుల‌ను శ‌నివారం స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతు కాలనీ వాసుల అభ్యర్థ‌న మేర‌కు పార్కులో మొక్కల పరిరక్షణ కొరకై నూతనంగా బోరు వేయించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ప‌చ్చ‌ద‌న ప‌రిర‌క్ష‌ణలో సిబ్బందితో పాటు స్ధానికులు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సూచించారు. ప్రాధాన్య‌తా క్ర‌మంలో కాల‌నీలోని మిగిలిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని కార్పొరేట‌ర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్‌ జనరల్ సెక్రటరీ చంద్రిక ప్రసాద్ గౌడ్‌, కాలనీ అధ్య‌క్షులు కిషోర్, నాయకులు అశోక్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ప‌వ‌ర్‌బోరు ప‌నుల‌ను ప్రారంభిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌తో చంద్రిక ప్ర‌సాద్‌, కిషోర్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here