- చందానగర్ సర్కిల్‌లో ఐదవరోజు 989 మందికి టీకాలు…
- శేరిలింగంపల్లిలో షరా మామూలే – 468 మందికి వ్యాక్సిన్…
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పీజేఆర్ స్టేడియం వ్యాక్సినేషన్ సెంటర్‌కు సూపర్‌స్ప్రెడర్స్ పోటెత్తారు. మంగళవారం మద్యాహ్నం 12 గంటలలోపే సర్వర్ డౌన్ అయిపోయింది. అప్పటికే 989 మంది వ్యాక్సిన్ తీసుకోవడం విశేషం. శేరిలింగంపల్లి సర్కిల్ మాదిరిగా చందానగర్ సర్కిల్‌లోను కూపన్‌లకు బదులు ఆన్‌లైన్ యాప్ ద్వారా సూపర్‌స్ప్రెడర్స్ రిజిష్ట్రెషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలో బుదవారం ఆన్‌లైన్ ద్వారా అవకాశం లభించదు అనే కోనంలో స్టేడియంకు రద్ధీ పెరిగింది. ఉదయం నుంచే ఒకవైపు రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద, మరోవైపు స్టేడియం గేటు బయట వందల మంది బారులు తీరారు. ఒకానొక సందర్భంగా జనాలను అదుపుచేసేందుకు చందానగర్ పోలీసులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో సారధ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో పీజేఆర్ స్టేడియంలో 45 సంవత్సారల పైబడిన వారు 296 మంది, 18 సంవత్సరాల పైబడిన వారు 693 కలిపి మొత్తం 989 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో షరా మాములే అన్న చందంగా ఐదవరోజు సైతం వ్యాక్సినేషన్ సంఖ్యలో మార్పు కనిపించలేదు. 45 సంవత్సరాలు పైబడిన వారు 92 మంది, 18 ఏళ్లు పైబడిన వారు 376 కలిపి మొత్తం 468 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్‌రెడ్డిలు పీజేఆర్ స్టేడియంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.

కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో అటు వ్యాక్సిన్… ఇటు కరోనా పరీక్షలు…
కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లోను మంగళవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. 45 ఏళ్లు పైబడిన వారు 9 మంది, 18 ఏళ్లు పైబడిన వారు 53 మందికి కోవీషీల్డ్ వ్యాక్సిన్, 16 మందికి కోవాక్జిన్ 2వ డోసు టీకాలు ఇచ్చినట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ వరదాచారి తెలిపారు. అదేవిధంగా 57 మందికి ఆర్టీపీసీఆర్, 111 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ కలిపి మొత్తం 168 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని, యాంటిజెన్‌లో 10 మందికి కోవిడ్ పాజిటీవ్ వచ్చినట్టు తెలిపారు.
