హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణి దేవి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టీఆరెఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆమెను ఆమె నివాసంలో బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ నేత, పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ పిడిశెట్టి రాజు, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పు సత్యనారాయణలు కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సురభి వాణిదేవి ఎమ్మెల్సీ గా పోటీ చేయడం పట్ల పీవీ నరసింహారావు జన్మించిన వంగర, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీవీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
