శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆయువు స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ (ASYF)కి బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ దక్కింది. ఈ మేరకు విశ్వగురు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ప్రతినిధి రామారావు ఈ అవార్డును ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి. రోహిత్ ముదిరాజ్ కు అందజేశారు. ఈ సందర్బంగా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ తాము చేస్తున్న సామాజిక సేవకు గాను ఈ అవార్డు లభించిందని తెలిపారు. తమ బృందానికి, తమకు సహాయ సహకారాలు అందించిన వారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నామన్నారు. గత 9 ఏళ్ల నుంచి ASYF ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి భాను ముదిరాజ్, ,అఖిల్, మాలిక్ పాల్గొన్నారు.
