చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చందానగర్ డివిజన్ లో బీజేపీ నైతిక విజయం సాధించిందని ఆ పార్టీ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కసిరెడ్డి సింధు రెడ్డి అన్నారు. చందానగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడినా బిజెపిని ప్రజలు ఆదరించారని, 2023లో బిజెపి జెండా శేరిలింగంపల్లిలో రెపరెపలాడించడం ఖాయమని అన్నారు. ఓటింగ్ శాతం మరింత పెరిగితే మంచి ఫలితం వచ్చేదని అన్నారు. విశేష కృషి చేసిన కార్యకర్తలకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ నాయకుడు జి. రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజశేఖర్, రాకేష్ దూబే, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, పగడాల వేణుగోపాల్, శివకుమార్ వర్మ, అమిత్ దూబే, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీనివాస్ గుప్త, శ్రీవాణి, నిషాత్, లలిత పాల్గొన్నారు.

