వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని నారాయణ ఎస్టేట్స్ లో తెరాస నాయకుడు శంకర్ రావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహిస్తుందని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలను నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవరెడ్డి, తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, రాంచందర్ రావు, హిమగిరి రావు, కార్తీక్ రావు, అల్లం మహేష్, సాలయ్య, గిరి బాబు, లింగయ్య, సంపత్, లక్ష్మణ్ సాగర్, శ్రావణి రెడ్డి, లక్ష్మీ పాల్గొన్నారు.