శేరిలింగంప‌ల్లిలో బీజేపీ బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగింది: బీజేపీ నాయ‌కులు

మియాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఆల్విన్ కాల‌నీలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. బీజేపీ నాయకులు యోగానంద్, రవికుమార్ యాదవ్, జ్ఞానేంద్ర ప్రసాద్ లు ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్లలో అధికార పార్టీ తెరాసకు గట్టి పోటీ ఇచ్చామ‌న్నారు. బీజేపీ కార్యకర్తల కృషి వల్లనే నేడు శేరిలింగంపల్లి అసెంబ్లీలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగింద‌న్నారు. రానున్న రోజుల్లో శేరిలింగంపల్లిలో బీజేపీకి చెందిన నాయకున్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామ‌ని అన్నారు.

స‌మావేశంలో పాల్గొన్న బీజేపీ నాయ‌కులు

అనంతరం గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గా విజయం సాధించిన వి.గంగాధర్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్, నాగేశ్వర్ గౌడ్, జ్ఞానేంద్ర ప్రసాద్, గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మనోహర్, నర్రా జయలక్ష్మి, బీజేపీ నాయకులు రాధాకృష్ణ యాదవ్, రఘునాథ్, రాఘవేంద్రరావు, రవీందర్ రావు, ఏకాంత్ గౌడ్, సింధు రఘునాథ్ రెడ్డి, వెలగ శ్రీనివాస్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మాణిక్య‌రావు, కృష్ణ‌ ముదిరాజ్, కమలాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, జయ రాములు, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కుమ్మరి జితేందర్, బీజేపీ నాయకులు నారాయణరెడ్డి, నరేందర్ ముదిరాజ్, రవి గౌడ్ పాల్గొన్నారు.

హాజ‌రైన బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here