క్రిస్మ‌స్‌ను ప్ర‌జ‌లు ఆనందోత్సాహాల న‌డుమ జ‌రుపుకోవాలి: ర‌ఘునాథ్ రెడ్డి

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని 25 చర్చిలకు తన సొంత ఖ‌ర్చులతో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి క్రిస్మస్ కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులు క్రిస్మస్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అన్నారు. డివిజన్ లోని ప్రతి చర్చికి క్రిస్మస్ కేక్ ను అందజేయడం జరిగిందన్నారు. క్రైస్తవులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. చందానగర్ డివిజన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ అంథోనీ, ఏలీయా, నాథనియల్, టీఆర్ఎస్ నాయకులు అక్బర్, దాస్, కిరణ్, విజయ్ పాల్గొన్నారు.

చ‌ర్చిల‌కు కేక్‌ల‌ను పంపిణీ చేస్తున్న ర‌ఘునాథ్ రెడ్డి

క్రిస్మ‌స్ కానుక‌ల పంపిణీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేయడం జరుగుతుందని చందాన‌గ‌ర్ డివిజ‌న్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం గ్రేస్ వింగ్స్ ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమి క్రిస్మస్ వేడుకలకు ఆయ‌న‌ ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అందజేస్తున్న క్రిస్మస్ కానుకలను రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల అభివృద్ధి కోసం పాటు పడుతుందని అన్నారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆనందాల మధ్య జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ అంథోనీ, ఏలీయా, నాథనియల్, టిఆర్ ఎస్ నాయకులు అక్బర్, దాస్, కిరణ్ పాల్గొన్నారు.

క్రిస్మ‌స్ కానుక‌ల‌ను పంపిణీ చేస్తున్న ర‌ఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here