శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆనందోత్సాహాల నడుమ పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలు అందరూ కలసి మెలసి మత సామరస్యంతో పండుగలను జరుపుకోవాలని అన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలను పాటించాలన్నారు.