చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆ పార్టీ చందానగర్ డివిజన్ అభ్యర్థి కసిరెడ్డి సింధు రెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని భవానీపురం, శంకర్ నగర్, ఫ్రెండ్స్ కాలనీ, విస్టా నగర్, వేముకుంటలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.



అనంతరం ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కేంద్రం నుంచి ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా నగరాన్ని అభివృద్ధి చేయకపోవడం దారుణమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సత్వర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రజలు బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
తప్పకుండా