హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ అభివృద్ధి జరగదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని జనప్రియ ఫేజ్ 1లో TSEWIDC ఛైర్మెన్ నాగేందర్ గౌడ్, వికారాబాద్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి పూజిత జగదీశ్వర్ గౌడ్‌లతో కలిసి గాంధీ ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ప్రజలందరూ తెరాస అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఇతర పార్టీలకు ప్రజలు ఓటు వేస్తే వృథాయేనన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలని కంకణం కట్టుకున్నారన్నారు. అది కేవలం తెరాసకే సాధ్యమని, కనుక ప్రజలు తెరాస అభ్యర్థులనే కార్పొరేటర్లుగా గెలిపించాలన్నారు. తెరాసతోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో తెరాస కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, వెంకటేష్, ప్రవీణ్, సుధాకర్, నాయుడు పాల్గొన్నారు.