మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సేవకులు కావాలో, ప్రజా భక్షకులు కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలేనని బీజేపీ నాయకుడు మొవ్వా సత్యనారాయణ, మియాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు అన్నారు. ఆదివారం గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో డివిజన్ పరిధిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం, ర్యాలీలు నిర్వహించారు.

మియాపూర్‌లోని కృషి నగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంత్ నగర్, మక్తా, రెడ్డి ఎన్‌క్లేవ్, బీకే ఎన్‌క్లేవ్, కేంద్రీయ విహార్, మయూరి నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, డోవ కాలనీ, న్యూ కాలనీ, దత్త సాయి కాలనీ, జేపీ నగర్ , ప్రగతి ఎన్‌క్లేవ్ ల మీదుగా కొనసాగి సినీ టౌన్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ప్రచారం, ర్యాలీల్లో పాల్గొన్న మొవ్వా సత్యనారాయణ, కర్లపూడి రాఘవేంద్ర రావులు మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో కాషాయ దళం ఉత్సాహంతో ఉరకలు వేస్తుందన్నారు. బీజేపీతోనే అభివృద్ది సాధ్యమవుతుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని అన్నారు. గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటడం ఖాయమన్నారు.

బీజేపీ అభ్యర్థులకు ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తుందన్నారు. తెరాస నాయకులు ఇస్తున్న మోసపూరిత వాగ్దానాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. వివేకవంతులైన ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు వేయాలని, ఓటు హక్కు ప్రజలకు ఆయుధమని అన్నారు. డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్ యాదవ్, సమ్మెట ప్రసాద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు evadu గెలిచింది ముఖ్యం కాదు, ఓటు వేసి నందుకు ప్రజల samasayulu తీర్చే వాడు కావాలి..
కానీ తెరాస పార్టి కి కొంచం విశ్రాంతి ఇవండీ.. ఎందుకంటే వాళ్లు ప్రజా సేవలు చేసి చేసి అలసి పోయారు