చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి బీజేపీకే ఓటు వేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గిరిజా మార్వెల్‌లో నివాసితులతో కలిసి ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. డివిజన్ బీజేపీ అభ్యర్థిని కసిరెడ్డి సింధురెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గత గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలనే ఇస్తూ తెరాస నాయకులు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, కనుక ప్రజలు వారికి గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేవలం బీజేపీ మాత్రం 100 శాతం నెరవేరుస్తుందన్నారు. అందుకు కేంద్రంలోని మోదీ సర్కారే నిదర్శనమన్నారు. ఆయన రెండోసారి ప్రధాని అయ్యారంటే అది ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధేనని అన్నారు. కనుక గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు.