నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి ఎన్ క్లేవ్, గౌతమీ నగర్, సాయి మారుతీ కాలనీ, ముస్లిం బస్తీ కాలనీలలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖల అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పర్యటించారు. అంటు వ్యాధులు ప్రభలకుండా ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్ల పై, ఇళ్ల మధ్యలో, కాలనీల్లోని ఖాళీ స్థలాలలోని వ్యర్థాలను శానిటేషన్ సిబ్బంది సహాయంతో తొలగించారు. అదేవిధంగా నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి, వాటర్ వర్క్స్ మేనేజర్ సునిత, శానిటేషన్ విభాగం అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు గురుచరణ్ దూబే, మల్లేష్ పబ్బా, పుల్లిపాటి నాగరాజ్, ఓ వెంకటేష్, రవీందర్ రెడ్డి, నరేంద్ర భల్లా, అక్బర్ ఖాన్, దాస్, అంజద్ పాషా, రాజశేఖర్ రెడ్డి, కొండల్ రెడ్డి, హరీష్ రెడ్డి, కార్తీక్ గౌడ్, యశ్వంత్, ఉదయ్, అఫ్సర్, అమిత్, ఏడుకొండలు, శ్రీనివాస్, వినయ్, ముఖేష్, సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.
