నమస్తే శేరిలింగంపల్లి: నగర ప్రజల భాగస్వామ్యంతో పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేలా నాలా పనులు పూర్తి చేయాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ సుదాంష్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆయా శాఖల అధికారులతో కలిసి మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. ఈర్ల చెరువు, మదీనగూడ మెయిన్ రోడ్డు దీప్తి శ్రీ నగర్ నాలా విస్తరణ పనులను పరిశీలించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం వలన అభివృద్ధి పనులకు ప్రణాళిక, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూపకల్పన చేసి నగరంలో ఎదురొంటున్న సమస్యలను అధిగమించడానికి దోహదపడుతుందని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తూ ఫాగింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. పనికి రాని వస్తువులు, నిర్మాణ వ్యర్థాల కోసం తాత్కాలిక పాయింట్ గుర్తించి సేకరించిన మొత్తాన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే తరలించాలన్నారు. హరిత హారంలో నాటిన మొక్కల చుట్టూ కలుపు తీయడం, మట్టి పోయడం, ఎండిపోయిన మొక్క స్థానంలో మరొక మొక్క నాటాలని, నీరు నిలువకుండా పరిశుభ్రత పాటించాలని మేయర్ అధికారులను ఆదేశించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు ముమ్మరంగా పూర్తి చేసి ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేలా యుద్ధ ప్రాతిపదికన నాలా పనులను చేపట్టడం జరుగుతుందని, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతామని చెప్పారు. ప్రతి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ, మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన, మెరుగైన జీవన విధానాన్ని కల్పించడం కోసం తమ శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ మల్లయ్య, ఏఎంహెచ్ఓ కార్తిక్, ఈఈ శ్రీకాంతి, డీఈ సురేష్, వాటర్ వర్క్స్ డీజీఎం శ్రీమన్నారాయణ, మేనేజర్ మానస, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్ కుమార్, టీపీఎస్ రవీందర్, ఏ.ఈ ప్రతాప్, టీఆర్ఎస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి,బాలింగ్ యాదగిరి గౌడ్, గౌరవ ఉపాధ్యక్షులు వాలా హరీష్ రావు, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు కనకమామిడి నరేందర్ గౌడ్, వార్డు సభ్యులు కనక మామిడి వెంకటేష్ గౌడ్, మైనారిటీ నాయకులు షేక్ సాబేర్, నాయకులు ఉమామహేశ్వర రావు, విష్ణు, వెంకటయ్య, మోహన్, విజయ్ కుమార్, అనిల్, ప్రదీప్ రెడ్డి, కృష్ణ రావు, శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ, ప్రభాకర్, గంగాధర్, వెంకటేశ్వర రెడ్డి, నారాయణ రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
