శేరిలింగంపల్లిలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని GHMC కమిషనర్ R.V కర్ణన్ కు PAC చైర్మన్ గాంధీ విన‌తి

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): GHMC ప్రధాన కార్యాలయంలో GHMC కమిషనర్ R.V కర్ణన్ ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న H-CITI ప్రాజెక్ట్స్ పనులు, SNDP విభాగంలో జరుగుతున్న నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాలాల విస్తరణ పనులలో వేగం పెంచాలని, పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరిన‌ట్లు తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. దీనిపై GHMC కమిషనర్ R.V. కర్ణన్ సానుకూలంగా స్పందించార‌ని గాంధీ తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here